తిరుమలలో తగ్గని రద్దీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:41 AM
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధులు, బస్టాండ్, లేపాక్షి సర్కిల్, లడ్డూ కౌంటర్, పాపవినాశనం, శ్రీవారిపాదాలు వంటి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాల్లో భక్తులు అధిక సంఖ్యలో కొండకు తరలివస్తున్నారు. గదులకు డిమాండ్ కొనసాగుతుండటంతో భక్తులు కార్యాలయాల ముందు, షెడ్లు, చెట్లకింద, ఫుట్‌పాత్‌లపై సేదతీరుతున్నారు. గదుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించాల్సి వస్తోంది. కల్యాణకట్టల్లోనూ యాత్రికుల సందడి నెలకొంది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి