తహసీల్దార్ల బదిలీలు రెండ్రోజుల్లో కొలిక్కి
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:14 AM
తహసీల్దార్ల బదిలీల అంశం సోమవారం నాటికి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 20: తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జోన్-4 పరిఽధిలోని మూడు ఉమ్మడి జిల్లాలకు జిల్లా నుంచి బదిలీ అయిన 31 మంది తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నాటికి తహసీల్దార్ల బదిలీల అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీసీఎల్‌ఏ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత సొంత జిల్లాలకు వచ్చేస్తారు. ఎన్నికల సమయంలో జరిగిన వ్యయ వివరాలన్నీ బిల్లులతో సహా అందజేసిన వారికే రిలీవింగ్ ఆర్డర్లు ఇస్తారు. సొంత రెవెన్యూ డివిజన్ల పరిధిలో నియమించకూడదన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో పనిచేసిన చోటు కాకుండా 31 మందిని వేరే స్థానాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తహసీల్దార్లకు మండలాలను కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికారిక ఉత్తర్వులు ఇస్తారు.