Share News

ఎస్‌ఐల బదిలీ

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:39 AM

రానున్న ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ జాషువా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎస్‌ఐల బదిలీ

చిత్తూరు, ఫిబ్రవరి 28: రానున్న ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ జాషువా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు సీసీఎస్‌లో పనిచేస్తున్న టి.ప్రసాద్‌ను టూటౌన్‌కు, వీఆర్‌లో ఉన్న ఎస్‌.లోకే్‌షను పెనుమూరుకు, గంగాధరనెల్లూరులోని బి. రామాంజనేయులును యాదమరికి, గంగవరంలో పనిచేస్తున్న యు.ప్రతాప్‌ రెడ్డిని చౌడేపల్లెకు, చిత్తూరు సీసీఎస్‌, ట్రాఫిక్‌లో పనిచేస్తున్న ఇ.బాబును వి.కోటకు, వీఆర్‌ ఉన్న వై.సుమన్‌ను నగరికి బదిలీ చేశారు. చిత్తూరు ట్రాఫిక్‌ నుంచి ఇ.జయప్పను డీఆర్సీబీకి, వీఆర్‌ నుంచి సి.వెంకటేశ్వర్లును డీటీసీకి, ఐరాల నుంచి యు.వెంకటేశ్వరును వెదురుకుప్పానికి, వెదురుకుప్పం నుంచి బి.రమే్‌షబాబును ఐరాలకు, కాణిపాకం ఎస్‌ఐ పి.శ్రీనివాసరావును గుడిపాలకు బదిలీ చేశారు. గుడిపాల ఎస్‌ఐ కె.రామ్మోహన్‌ను కాణిపాకానికి, వీఆర్‌లో ఉన్న కె.స్వర్ణతేజను డీసీఆర్బీకి, బి.సుబ్బారెడ్డిని డీటీసీకి, ఎం.రాజకుళ్లాయప్పను శ్రీరంగరాజపురానికి, కె.శాంతమ్మను దిశ మహిళా స్టేషన్‌కు, వన్‌టౌన్‌లో పనిచేస్తున్న బి.భారతిని చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఎస్‌ఐలు తమకు కేటాయించిన స్థానాల్లో రెండురోజుల్లో రిపోర్ట్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, చిత్తూరు వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐలు ఎం.కె. ప్రవీణ్‌ కుప్పానికి, జి.నాగేంద్ర కుమార్‌ చిత్తూరు వన్‌టౌన్‌కు, ఎ.వెంకటక్రిష్ణ కార్వేటినగరానికి, డి.శేషగిరి చిత్తూరు తాలుకాకు, ఎ.వెంకట నారాయణ నిండ్రకు, ఎస్‌.వెంకటరాముడు విజయపురానికి, జి.రామచంద్రయ్య నగరికి, జి.ఇక్బాల్‌ చిత్తూరు టూటౌన్‌కు బదిలీ అయ్యారు.

Updated Date - Feb 29 , 2024 | 01:40 AM