Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వసూళ్లల్లో టాప్‌

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:48 AM

రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పదవిని అడ్డుపెట్టుకుని వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయడంలో కృపాలక్ష్మి టాప్‌లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ థామస్‌ ఆరోపించారు.

వసూళ్లల్లో టాప్‌
వీరకనెల్లూరులో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ థామస్‌

తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కృపాలక్ష్మి అక్రమార్జన చేశారంటూ థామస్‌ ఆరోపణ

గంగాధరనెల్లూరు, మార్చి 3: రాజకీయాల్లోకి రాకముందే తన తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పదవిని అడ్డుపెట్టుకుని వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయడంలో కృపాలక్ష్మి టాప్‌లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ థామస్‌ ఆరోపించారు. గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరులో తన నగదు రూ.5లక్షలతో ఏర్పాటుచేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ని ఆదివారం ఆయన నేతలతో కలిసి ప్రారంభించారు. ఎస్సీ సర్టిఫికెట్‌తో నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవి, ఆయన సతీమణికి జడ్పీటీసీ, ఇప్పుడు కుమార్తెకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ వచ్చిందేకానీ, నియోజకవర్గ ప్రజలు బాగుపడలేదన్నారు. ఓట్ల కోసం వచ్చే వారి కుటుంబసభ్యులను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సొంత చెల్లెళ్లు షర్మిల, సునీతలే సీఎం జగన్‌ ప్రభుత్వం వద్దంటున్నారని థామస్‌ అన్నారు. అంతకు మునుపు వీరకనెల్లూరు దళితవాడకు చెందిన వైసీపీ ఎంపీటీసీ మరిది ఏకాంబరం టీడీపీ కండువా కప్పుకుని థామస్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈసమావేశంలో జిల్లా తెలుగుయువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దేవపత్ని ధనంజయ నాయుడు, జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అరుణ, మండల టీడీపీ అధ్యక్షులు స్వామిదాస్‌, నేతలు లోకనాధరెడ్డి, రుద్రయ్య నాయుడు, విజయన్‌, నరేష్‌, చిరంజీవి నాయుడు, కోదండరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు సురే్‌షరెడ్డి, దళితవాడ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:48 AM