Share News

రేపు నిమ్మ మార్కెట్‌కు సెలవు

ABN , Publish Date - Jun 03 , 2024 | 02:22 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ జరగనుండడంతో గూడూరు నిమ్మ మార్కెట్‌కు అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం సెలవు ప్రకటించారు.

రేపు నిమ్మ మార్కెట్‌కు సెలవు

గూడూరు అర్బన్‌, జూన్‌ 2: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ జరగనుండడంతో గూడూరు నిమ్మ మార్కెట్‌కు అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రతి బుధవారం నిమ్మ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. అయితే కౌంటింగ్‌ను వీక్షించేందుకు నిమ్మకాయలు లోడింగ్‌ చేసే కార్మికులు సెలవు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళ, బుధవారాల్లో మార్కెట్‌కు సెలవు ఉంటుంది. రైతులు, ఆటో కార్మికులు గమనించాలని, సోమవారం నుంచి నిమ్మ రైతులు కోతలకు విరామం ప్రకటించాలని వ్యాపారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 02:22 AM