నేడు జాబ్‌మేళా
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:31 AM
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులోని ఎస్వీసెట్‌లో జరిగే ప్రాంతీయ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షన్మోహన్ కోరారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 19: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులోని ఎస్వీసెట్‌లో జరిగే ప్రాంతీయ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షన్మోహన్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్వీసెట్‌కు వెళ్లే నిరుద్యోగుల కోసం పీసీఆర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్‌లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లింకులో నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్‌కార్డు జిరాక్సు, 20 బయోడేటా ఫారాలు (రెజ్యూమ్‌లు), సర్టిఫికెట్ల జిరాక్సులను తీసుకురావాలని సూచించారు. వందకు పైగా ఐటీ సెక్టార్, బీపీవో, ఎలకా్ట్రనిక్, మాన్యుఫాక్చరింగ్, రీటైల్ సెక్టార్లకు సంబంధించిన దాదాపు వందకు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఇతర వివరాలకు 81425 09017, 63009 54441 నెంబర్లలో సంప్రదించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ డెవల్‌పమెంట్ ఆఫీసర్ శ్యామ్‌మోహన్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి సూచించారు.