Share News

క్రైస్తవులుగా నమోదు చేయమంటే దౌర్జన్యం

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:10 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేలో క్రైస్తవులుగా నమోదు చేయమంటే దౌర్జన్యం చేశారని చౌడేపల్లె మండలం పక్షిరాజపురం గ్రామానికి చెందిన క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు.

క్రైస్తవులుగా నమోదు చేయమంటే దౌర్జన్యం
కలెక్టరేట్‌కు వచ్చిన పక్షిరాజపురం ఎస్టీలు

చిత్తూరు, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేలో క్రైస్తవులుగా నమోదు చేయమంటే దౌర్జన్యం చేశారని చౌడేపల్లె మండలం పక్షిరాజపురం గ్రామానికి చెందిన క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు. తాము ఎస్టీ నక్కల కులానికి చెందిన వారమని, 30ఏళ్ల క్రితమే తమ పూర్వీకులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారని తెలిపారు. వలంటీర్‌ కులగణన సర్వేకు వచ్చిన సమయంలో తమను క్రైస్తవులుగా నమోదు చేయమని కోరగా, అంగీకరించలేదన్నారు. మేం చెప్పినట్లు వినకుంటే ఆధార్‌, రేషన్‌కార్డులను రద్దు చేస్తామని బెదిరింపులకు దిగడమే కాకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చామన్నారు. వీరికి పాస్లర్ల సంఘం రాయలసీమ వైస్‌ ప్రెసిడెంట్‌ రెవరెండ్‌ రాబర్ట్‌ మద్దతు పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని అధికారులకు వినతిపత్రం అందచేశారు.

Updated Date - Feb 07 , 2024 | 01:10 AM