Share News

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండకూదు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:58 AM

జిల్లాలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకూడదని ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండకూదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు

ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు

చిత్తూరు రూరల్‌, మార్చి 5: జిల్లాలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకూడదని ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, జిల్లా స్టోర్స్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం చిత్తూరులోని అర్బన్‌ డివిజన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వేసవి మొదలైందని, విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పరీక్షల సమయం కావడంతో 24 గంటలూ విద్యుత్‌ సరఫరా అందించాలని తెలిపారు. విద్యుత్‌ బిల్లుల పెండింగ్‌ బకాయిలను త్వరగా వసూలు చేయాలన్నారు. ఎండలకు ఎక్కువ శాతం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే ప్రమాదముందని, వీటిని వెంటనే మరమ్మతు చేయాలన్నారు. ఈఈలు పద్మనాభపిళ్లై, హరి, డీఈలు శేషాద్రి, జ్ఞానేశ్వర్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:58 AM