Share News

టీడీపీ నేతల మాట

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:06 AM

గంగాధరనెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద మంగళవారం జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

టీడీపీ నేతల మాట

జీడీనెల్లూరు, ఫిబ్రవరి 6: గంగాధరనెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద మంగళవారం జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాకముందు.. వచ్చాక పలువురు నేతలు ప్రసంగించారు. వీరిలో కొందరి ప్రసంగం వారి మాటల్లోనే..

వీళ్లా జిల్లాను అభివృద్ధి చేసేది

జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. అందులో ఒకడేమే పుంగనూరులో అక్రమ కేసులు పెడతాడు. మరో మహిళా మంత్రేమో పదవులు ఇప్పిస్తానని సొంత నాయకుల చేత డబ్బులు వసూలు చేస్తుంది. ఇక్కడున్న ఉపముఖ్యమంత్రి పొద్దున ఏమి మాట్లాడతాడో.. సాయంత్రం ఏమి మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి వాళ్లా జిల్లాని అభివృద్ధి చేసేది.

- అమరనాథరెడ్డి, మాజీ మంత్రి.

జిల్లాను దోచుకుంటున్నారు

జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి జగన్‌కు బినామీగా దోచిపెడుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డికి చిత్తూరు అసెంబ్లీ ఇన్‌చార్జి ఇచ్చారు. చంద్రగిరిలో గంజాయి, ఎర్రచందనం, ఎర్రమట్టి, ఆస్తులు దోచుకుంటున్న వ్యక్తి చెవిరెడ్డి. వీరందరికీ ముఠా నాయకుడు పెద్దిరెడ్డి.

- పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు.

కొండల్ని పిండి చేస్తున్నారు

జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భూకబ్జాలు, కొండల్నీ పిండిచేసి ఆక్రమించేస్తున్నారు. నారాయణస్వామి ఓ పక్క ఎర్రచందనం దొంగని, మరో పక్క ఇసుక దొంగని పెట్టుకుని నియోజకవర్గాన్ని దోచేశారు. టీడీపీని గెలిపించండి. యువతకి ఉద్యోగం, పరిశ్రమలు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా.

- థామస్‌, జీడీనెల్లూరు టీడీపీ ఇన్‌చార్జి.

ఎస్సీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి

ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం నా ఎస్సీలు, నా బీసీలు అని ప్రగల్బాలు పలుకుతుంటారు. మరి, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను, బీసీ సబ్సిడీ నిధులను పక్కదారి పట్టిచింది నువ్వు కాదా? ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే జిల్లాలో అన్నీ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయం అనిపిస్తుంది.

- మురళీమోహన్‌, పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి.

ఎన్ని కేసులు పెట్టినా భయపడం

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి 15 కేసులు పెట్టాడు. మరో 150 పెట్టినా భయపడం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చలేని అసమర్థుడు. ఆయన్ను ఓడించి సీబీఐ ఎంక్వయిరీ వేసి లోపలవేస్తాం. ఖబడ్దార్‌.

- యుగంధర్‌, జనసేన జీడీనెల్లూరు ఇన్‌చార్జి.

Updated Date - Feb 07 , 2024 | 01:06 AM