Share News

ఉమ్మడి కలెక్టర్లుగా చేసిన ఇద్దరికి కొత్త ప్రభుత్వంలో కీలక కొలువులు

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:46 AM

గతలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా పనిచేసినవారిలో ఇద్దరు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండబోతున్నారు.

ఉమ్మడి కలెక్టర్లుగా చేసిన ఇద్దరికి కొత్త ప్రభుత్వంలో కీలక కొలువులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 7: గతలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా పనిచేసినవారిలో ఇద్దరు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎ్‌స)గా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ 1998లో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈ బాధ్యతల్లో ఆయన ఉన్నది 9 నెలలే అయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో ఆ సమయంలో కరువు తీవ్రంగా ఉంది. మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పనికి ఆహార పథకాన్ని ఆయన సమర్థంగా అమలు చేశారు. ఈయన 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. చంద్రబాబు నాయుడు పాలనలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేశారు.

ఫ ఇక 2008-09లో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ముద్దాడ రవిచంద్ర ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీఎంవోలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

కేజీబీవీ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయేంద్రరావు

చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 7: చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జి డీఈవోగా పనిచేసి, ఏడీ-1గా కొనసాగుతున్న విజయేంద్రరావుకు రాష్ట్ర స్థాయి అధికారిగా పదోన్నతి లభించింది. సమగ్రశిక్షలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా ఆయన స్థానంలో ఏడీ-2గా పనిచేస్తున్న వెంకటే్‌షకు ఏడీ-1 ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jun 08 , 2024 | 08:15 AM