బలిజకండ్రిగలో తమిళ మందుబాబుల సందడి
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:34 AM
కనుమ సందర్భంగా తమిళనాడులో మద్యం షాపులు మూసేయడంతో సరిహద్దుల్లోని పాలసముద్రం మండలం బలిజకండ్రిగ మద్యం షాపు మంగళవారం కిటకిటలాడింది.
పాలసముద్రం, జనవరి 16: కనుమ సందర్భంగా తమిళనాడులో మద్యం షాపులు మూసేయడంతో సరిహద్దుల్లోని పాలసముద్రం మండలం బలిజకండ్రిగ మద్యం షాపు మంగళవారం కిటకిటలాడింది. ఉదయం నుంచే రద్దీ పెరగడంతో మద్యం దుకాణాల ఎదుట పోలీసులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రోజుకు లక్షా లక్షన్నర రూపాయల అమ్మకాలు జరిగే ఈ షాపులు అయిదారు లక్షల మద్యం హాట్‌కేకుల్లా అమ్ముడైపోయింది. నిజానికి తమిళనాడు కంటే ఇక్కడ మద్యం ధరలు ఎక్కువ. అయినా తమిళనాడు మందుబాబులు ఎగబడ్డారు.