Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

తవ్వే కొద్దీ తప్పులే

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:47 AM

తప్పుల్లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని గతంలో ఉన్నతాధికారులు పదేపదే ఆదేశించినా తుది జాబితా ఇందుకు బిన్నంగా ఉంది.

తవ్వే కొద్దీ తప్పులే
అత్తారింటికి వెళ్లిన గుణకు కొనసాగుతున్న ఓటు

ఆందోళనలో ఓటర్లు

పెనుమూరు, మార్చి 3: తప్పుల్లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని గతంలో ఉన్నతాధికారులు పదేపదే ఆదేశించినా తుది జాబితా ఇందుకు బిన్నంగా ఉంది. అధికారులు ఆదేశించినా తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. తుది జాబితాలను పరిశీలిస్తే తప్పులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పెనుమూరు మండలంలోని 40వ బూత్‌ లో వరుస సంఖ్య 168లో కాంతమ్మకు ఓటు ఉంది. అయితే ఈమె మరణించి చాలా కాలం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. వసంతమ్మ కూడా చాలాకాలం కిందటే మృతిచెందినా వరుస సంఖ్య 355లో ఓటు హక్కు ఉంది. మృతుడు క్రిష్ణయ్య కూడా ఇక్కడ ఓటరే. అలాగే బి.ప్రీతి, పి.గుణకు పెళ్లై బయటి ప్రాంతాలకు వెళ్లిపోయినా తుది జాబితాలో వారికి ఓటు హక్కు కల్పించడం గమనార్హం.

ఫ అలాగే, పెనుమూరు మండలంలోని బూత్‌ నెంబరు 9లో వరుస సంఖ్య 530లో దేవళ్ల రాజయ్యకు ఓటు హక్కు కల్పించారు. ఈయన మరణించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇదే బూత్‌లో వరుస సంఖ్య 671లో ఈశ్వరయ్య.వీ అనే వ్యక్తికి ఓటుంది. ఆయన కూడా చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 12:47 AM