Share News

వామపక్షం తిరుపతిలో మాత్రం అధికారపక్షం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:44 AM

తిరుపతిలో దొంగ ఓటరు కార్డుల కుంభకోణం అంశంతో రాష్ట్రమంతా గగ్గోలుగా మారింది. ఐఏఎస్‌ అధికారి లాగిన్‌ నుంచే 34 వేల ఓటరు కార్డులు దొంగతనంగా డౌన్‌లోడ్‌చేసి నకిలీ కార్డులు సృష్టించిన వ్యవహారంలో ఐఏఎ్‌సలు సస్పెండ్‌ అయ్యారు.

వామపక్షం తిరుపతిలో మాత్రం అధికారపక్షం

తిరుపతిలో దొంగ ఓటరు కార్డుల కుంభకోణం అంశంతో రాష్ట్రమంతా గగ్గోలుగా మారింది. ఐఏఎస్‌ అధికారి లాగిన్‌ నుంచే 34 వేల ఓటరు కార్డులు దొంగతనంగా డౌన్‌లోడ్‌చేసి నకిలీ కార్డులు సృష్టించిన వ్యవహారంలో ఐఏఎ్‌సలు సస్పెండ్‌ అయ్యారు.ఐపీఎ్‌సలు బదిలీ అయ్యారు. అధికారులు, ఉద్యోగుల మీద వేటు తర్వాత వేటు పడుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ,జనసేన పార్టీలు దొంగ ఓట్ల సూత్రధారులను పట్టుకుని చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన ప్రకటిస్తున్నాయి. ప్రజాస్వామిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన నేరం తిరుపతి కేంద్రంగా జరిగితే విచిత్రంగా వామపక్ష పార్టీలు మాత్రం పెదవి విప్పడం లేదు. అన్నింటిమీదా పిడికిలెత్తి, డప్పుకొట్టి గొంతువిప్పే సీపీఐ, సీపీఎం నాయకుల్లో ఒక్కరి గొంతుకూడా ఎందుకు పెగలడం లేదబ్బా అనే సందేహం నగరంలో చర్చగా మారింది. అట్లా అని ఈ రెండు పార్టీలూ అధికార వైసీపీకి మిత్రపక్షాలు కూడా కాదు. జగన్‌ తీరుపై భగ్గుమనే ఈ పార్టీలు తిరుపతి నగరంలో మాత్రం భిన్నవైఖరి ఎందుకు తీసుకున్నాయన్నదే ప్రజలను విస్తుపరుస్తున్న అంశం. ఆశా వర్కర్ల ఆందోళనలు, అంగన్‌వాడీ వర్కర్ల సమ్మె, పారిశుధ్య కార్మికుల నిరసనలు,సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మె.. ఇలా అన్నింటా తామై కనిపించిన తిరుపతి వామపక్ష నేతలు.. ఇక్కడి వైసీపీ నాయకులకు సన్మానాలు చేయడం, వారిని పొగడ్తల్లో ముంచెత్తడం, కొన్నిసార్లు వారితో పొగిడించుకోవడం.. వంటి పరిణామాలను జనం ఒక కంట గుర్తిస్తూనే ఉన్నారు.

-తిరుపతి, ఆంధ్రజ్యోతి:

Updated Date - Feb 13 , 2024 | 12:44 AM