Share News

ఏకతాటిపైకి కూటమి పార్టీల నేతలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:08 AM

ఒకవైపు ఊపిరిసలపనంత బిజీ షెడ్యూల్‌...మరోవైపు జ్వరంతో వచ్చిన నీరసం...అవన్నీ పక్కనపెట్టి కూటమి నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చారు.

ఏకతాటిపైకి కూటమి పార్టీల నేతలు

తిరుపతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ఊపిరిసలపనంత బిజీ షెడ్యూల్‌...మరోవైపు జ్వరంతో వచ్చిన నీరసం...అవన్నీ పక్కనపెట్టి కూటమి నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చారు.రెండు రోజుల పాటు గ్రాండ్‌ రిడ్జి హోటల్లో మకాం చేసి అస మ్మతులను చల్లార్చారు.పొత్తుల్లో సీట్లు కోల్పో యిన కూటమికి చెందిన సీనియర్‌ నాయకుల త్యాగాల గురించి ప్రస్తావించారు.రాష్ట్ర ప్రయోజ నాల కోసం చంద్రబాబు,తాను చేస్తున్న పోరాటా లను వివరించారు. కష్టపడండి...మీ శ్రమ వృథా కానివ్వబోమని హామీ ఇచ్చారు.పవన్‌ నచ్చజెప్పి న తీరుతో కూటమినేతల్లో అసంతృప్తులు పటా పంచలయ్యాయి.ఒక్కో పార్టీ నాయకులతో దాదా పు గంటపాటు మాట్లాడిన తీరుకు నేతలంతా ఫిదా అయ్యారు. ఆదివారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని అసమ్మతి నేతలు చెప్పడ ంతో కథ సుఖాంతమైంది.టీడీపీ ఇంఛార్జి సుగుణ మ్మ నేతృత్వంలో ఆదివారం 34వ డివిజన్లో ప్రచారం జరగనుంది. అదేవిధంగా జనసేన ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యకర్తలతో సోమ వారం రామతులసీ కల్యాణమండపంలో సమా వేశమై ప్రచారానికి కార్యోన్ముఖులు కానున్నారు.

తిరుపతిపైనే ఫోకస్‌ ఎందుకంటే?

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్‌ చిరంజీవిని పాలకొల్లు తిరస్కరిస్తే... తిరుపతి అక్కున చేర్చు కుంది.ఆ విధంగా తిరుపతి నియోజకవర్గం మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారింది. ఈసారి ఎన్నికల్లో కూడా తిరుపతిలో పవన్‌ లేదా ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించినా కుదర్లేదు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు దక్కడంతో తిరుపతి సీటుపై ఆశపెట్టుకున్న టీడీపీ నేతలు నైరాశ్యంలోకి వెళ్లారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సీటు కేటాయించడంతో నిరాశ కాస్త వ్యతిరేకంగా మారింది.టీడీపీ నేతలే కాకుండా జనసేన ఇం ఛార్జి కిరణ్‌ రాయల్‌ కూడా అలకపాన్పు ఎక్కారు.ఇలా అంద రూ ఆరణికి వ్యతిరేకంగా మారడంతో వారిమధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్‌ రెండు రోజులపాటు తిరుపతిలో మకాం వేశారు. తిరుపతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం రాత్రి ఒంటిగంట వరకు టీడీపీ, జనసేన నాయకులతో భేటీ అయ్యారు.ఆరణి శ్రీనివాసులు విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీ తిరుపతి నియో జకవర్గ ఇంఛార్జి సుగుణమ్మ, జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. అప్పటివరకు అసంతృప్తులుగా వున్న వారి స్వరం మారింది. కూటమి అభ్యర్థి విజయం కోసం కలిసిపనిచేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 14 , 2024 | 07:45 AM