Share News

తలకాయ తీసేస్తా..!

ABN , Publish Date - May 21 , 2024 | 01:53 AM

ముక్కంటి ఆలయంలో అడ్డదారి దర్శనాలను హోంగార్డు అడ్డుకోవడంపై ఒక ఒప్పంద ఉద్యోగి రెచ్చిపోయాడు. ‘నన్నే ఆపుతావా.. నీ తలకాయ తీసేస్తా... బయటకు రా నీ అంతు చూస్తా... కత్తితో పొడిచేస్తా.ఏమనుకుంటున్నావు ’ అంటూ హడలెత్తించాడు.

తలకాయ తీసేస్తా..!

అడ్డదారి దర్శనాలను అడ్డుకున్న హోంగార్డుపై రెచ్చిపోయిన ముక్కంటి ఆలయ ఒప్పంద ఉద్యోగి

శ్రీకాళహస్తి, మే 20: ముక్కంటి ఆలయంలో అడ్డదారి దర్శనాలను హోంగార్డు అడ్డుకోవడంపై ఒక ఒప్పంద ఉద్యోగి రెచ్చిపోయాడు. ‘నన్నే ఆపుతావా.. నీ తలకాయ తీసేస్తా... బయటకు రా నీ అంతు చూస్తా... కత్తితో పొడిచేస్తా.ఏమనుకుంటున్నావు ’ అంటూ హడలెత్తించాడు. దీంతో వణికిపోయిన హోంగార్డు వైర్‌లె్‌స సెట్‌లోనే అధికారులకు బెదిరించడంపై తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దీంతో ఆలయం నలుమూలల్లో హోంగార్డుపై బెదిరింపు మాటలు సోమవారం మార్మోగాయి.శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఓ యువకుడు వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటాడు. రెండేళ్ల క్రితం అధికార పార్టీ సిఫార్సుతో పీఆర్వో కార్యాలయంలో ఉచిత సేవకుడిగా చేరాడు. అక్కడినుంచి అధికారులతో సన్నిహిత సంబంఽధాలను కొనసాగిస్తూ అడ్డదారి దర్శనాలు చేయిస్తూ ఆర్ధికంగా బలపడ్డాడు.ఓ అధికారి అండతో మూడు నెలల క్రితం దేవదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఒప్పంద ఉద్యోగిగా నియామకం పొందాడు.అయితే తమకు సంబంధం లేకుండా ఓ అధికారి సాయంతో ఒప్పంద ఉద్యోగి కావడంపై అధికార పార్టీ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ యువకుడికి సహకరించిన అధికారిని నిలదీశారు.ఆ తరువాత ఏం జరిగిందో కానీ అధికారులు, వైసీపీ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది. ఈ యువకుడి తరహాలోనే మరో ఏడుగురు ఒప్పంద ఉద్యోగులుగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.ఒప్పంద ఉద్యోగిగా మొదట చేరిన యువకుడు అడ్డదారిలో దర్శనాలు చేయించేందుకు యధేచ్ఛగా ఆలయంలోకి చొరబడేవాడు.అంతేకాకుండా ఆలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.సోమవారం ఆలయంలో పెద్దఎత్తున రద్దీ నెలకొనడంతో క్యూలైన్లు స్తంభించిపోకుండా భద్రతా సిబ్బందికి అధికారులు పలు ఆంక్షలు సూచించారు.అద్దాల మండపం వద్ద భక్తులు వెలుపలకు వచ్చే గేటు దగ్గర రాజేష్‌ అనే హోంగార్డుకు విధులు కేటాయించారు. భక్తులు వెలుపలకు వచ్చే క్యూలైన్‌లో ఎవరూ ఎదురు వెళ్లకుండా హోంగార్డు అడ్డుకట్ట వేశాడు. అయితే ఒప్పంద ఉద్యోగి ఓ భక్తుల బృందాన్ని తీసుకుని వ్యతిరేక దిశలో వెళ్లేందుకు అద్దాల మండపం వద్దకు చేరుకున్నాడు. అక్కడ హోంగార్డు రాజేష్‌ అడ్డదారిలో ప్రవేశించేందుకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఒప్పంద ఉద్యోగి వాగ్వాదానికి దిగాడు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకువస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హోంగార్డు తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఫోన్‌లో అధికారులకు జరిగిన వాగ్వాదంపై ఫిర్యాదు చేశారు. అయితే ఎవరూ అడ్డదారి దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో హోంగార్డు గేట్‌ తెరవలేదు. దీంతో ఒప్పంద ఉద్యోగి భక్తులందరూ చూస్తుండగానే కత్తితో పొడిచేస్తా... తల తీసేస్తానంటూ ఊగిపోయాడు. ఇంతలో హోంగార్డు భయాందోళనకు గురై ఒప్పంద ఉద్యోగి తనను దూషించిన విషయాన్ని వైర్‌లె్‌ససెట్‌ ద్వారా అధికారులకు తెలిపాడు. ఆలయ పరిసరాల్లోని అన్ని విభాగాల్లో పనిచేసే అధికారుల వద్ద వైర్‌లె్‌ససెట్లు ఉంటాయి. దాంతో ఒప్పంద ఉద్యోగి నిర్వాకం అన్ని వైర్‌లె్‌ససెట్లలో మార్మోగింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంతటి భయంకరమైన పదజాలంతో బెదిరించడంపై అధికారులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బంది హతాశులయ్యారు.

Updated Date - May 21 , 2024 | 07:34 AM