Share News

కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:18 AM

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత నోడల్‌ ఆఫీసర్లపై ఉందని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు.

కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 23: జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత నోడల్‌ ఆఫీసర్లపై ఉందని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. శనివారం ఎంపీడీవోలు, నోడల్‌ అధికారులు, ఇతర అధికారులతో కలె క్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రైవేటు స్థలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి ప్రచార సామగ్రికి అనుమతి ఉంటుందని, శాశ్వత ఏర్పాటుకు అనుమతి ఉండదని చెప్పారు. ప్రవర్తన నియమావళిని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో రాతలు, కటౌట్లు, బ్యానర్లు ఉంటే తొలగించి నియమావళిని అమలు చేయాలని కోరారు.

Updated Date - Mar 24 , 2024 | 12:18 AM