Share News

రూ.900 కోట్ల పంచాయతీ నిధులను సీఎం దారి మళ్లించాడు

ABN , Publish Date - May 26 , 2024 | 12:27 AM

ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి పంచాయతీ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర సర్పంచుల సంఘ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

రూ.900 కోట్ల పంచాయతీ నిధులను సీఎం దారి మళ్లించాడు
రాజేంద్రప్రసాద్‌తో ధనుంజయయాదవ్‌ తదితరులు

చంద్రబాబు సీఎం కావాలని వరసిద్ధుడిని కోరుకున్నా

రాష్ట్ర సర్పంచుల సంఘ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్‌

ఐరాల(కాణిపాకం), మే 25: ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి పంచాయతీ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర సర్పంచుల సంఘ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వేడుకున్నట్లు తెలిపారు. జగన్‌ పంచాయతీ నిధులను దారి మళ్లించి ఆయనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 17వ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వలేదని అన్నారు. ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఈవీఎంను పగులకొట్టడం దారుణమన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినా్‌షరెడ్డిని అరెస్టు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే పని అన్నారు. కాగా, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ను శనివారం కాణిపాకంలో చిత్తూరు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి చుక్కా ధనుంజయయాదవ్‌ సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు, సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి రవిరాజు, రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:27 AM