ఎస్వీయూ డిగ్రీ, పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Jun 01 , 2024 | 01:25 AM
ఎస్వీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి జూలై 2 వరకు జరుగుతాయి.
తిరుపతి(విశ్వవిద్యాలయాలు), మే 31: ఎస్వీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి జూలై 2 వరకు జరుగుతాయి. అదేవిధంగా పీజీ రెండు, నాల్గవసెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత వివరాలకోసం ఆయా ప్రిన్సిపాల్స్ కార్యాలయాల్లో సంప్రదించాలని సీఈ దామ్లా నాయక్ పేర్కొన్నారు.