Share News

ఎస్‌ఎస్‌ ఉద్యోగులకు ఎంఈవోల మద్దతు

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:18 AM

సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

ఎస్‌ఎస్‌ ఉద్యోగులకు ఎంఈవోల మద్దతు
మెడకు ఉరితాళ్లతో ఎస్‌ఎస్‌ ఉద్యోగుల నిరసన

తిరుపతి(విద్య), జనవరి 2: సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ వీరు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని, సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరారు. వీరికి పలువురు ఎంఈవోలు మద్దతు తెలిపారు. సమ్మెలో భాగంగా బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ఉద్యోగులు తెలిపారు. కాగా, జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు తిరుపతిలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:18 AM