చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్‌కుమార్
ABN , Publish Date - Jun 23 , 2024 | 02:04 AM
చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న షన్మోహన్ కాకినాడ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
కాకినాడకు బదిలీ అయిన షన్మోహన్
చిత్తూరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న షన్మోహన్ కాకినాడ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాయచోటికి చెందిన షన్మోహన్ 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. గతేడాది ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కోడ్ రాకముందు వరకు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ముద్ర ఉన్నప్పటికీ, కోడ్ వచ్చాక బ్యాలెన్స్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆయన జిల్లాలోనే కొనసాగేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వం ఆయన్ను కాకినాడ జిల్లాకు బదిలీ చేసింది. నిజంగా ఈయన ఎన్నికల్లో వైసీపీకి పనిచేసి ఉంటే కూటమి ప్రభుత్వం తదుపరి పోస్టింగ్ కలెక్టర్‌గా ఇచ్చేది కాదని తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈయన్ను ఇక్కడే ఉంచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తొలిసారి కలెక్టర్ హోదాలో చిత్తూరుకు వచ్చిన షన్మోహన్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా పనిచేశారు. జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రానున్న సుమిత్‌కుమార్ 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌గా పనిచేశారు. హర్యానా రాష్ట్రం రోహతక్ జిల్లా కోనూర్ గ్రామానికి చెందిన సుమిత్‌కుమార్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక నాలుగేళ్ల పాటు ఐటీ ప్రొఫెషనల్‌గా ఉద్యోగం చేశారు.