Share News

కన్నులపండువగా శ్రీనివాసుడి తెప్పోత్సవం

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:04 AM

తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో శనివారం రాత్రి తెప్పపై శ్రీవారి పుష్కరిణిలో విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు.

కన్నులపండువగా శ్రీనివాసుడి తెప్పోత్సవం

తిరుమల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో శనివారం రాత్రి తెప్పపై శ్రీవారి పుష్కరిణిలో విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఉత్సవమూర్తులు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. చివరిరోజైన ఆదివారం శ్రీవారు ఏడుచుట్లు తెప్పపై విహరించనున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 02:04 AM