చట్టసభల్లోకి సమర్థులను పంపండి
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:05 AM
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా చట్ట సభల్లోకి సమర్థులను పంపాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు.

చిత్తూరు, మార్చి 5: ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా చట్ట సభల్లోకి సమర్థులను పంపాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరులో మంగళవారం నిర్వహించిన కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు ఆవశ్యకత, ప్రజాస్వామ్యం విలువలను తెలియజేస్తూ కళాకారులు ప్రదర్శించిన కళాజాత ఆహూతులను అలరించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా, నైతిక విలువలకు పట్టం కట్టేలా రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రతిస్పందించాలని జిల్లా అరసం అధ్యక్షుడు గంటా మోహన్ సూచించారు. జిల్లా జానపద సంఘాల అధ్యక్షుడు ఆనంద నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వాదులు, యువఓటర్లు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి అరుణకుమారి, వాసుదేవ నాయుడు, రాజేష్, సహదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.