Share News

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడండి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:36 AM

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆదేశించారు.

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడండి
స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

అధికారులకు జడ్పీ చైర్మన్‌ సూచన

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం జడ్పీ చైర్మన్‌ ఛాంబర్‌లో 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ముందస్తుగా అన్ని గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు శుభ్రం చేసుకోవాలని, మంచినీటి పైపులను మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు. రబీ సీజన్‌లో పంటల సాగు విస్తరణ మరింత ఎక్కువ చేయాలన్నారు. పట్టుపరిశ్రమ అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందివ్వాలని సూచించారు. మామిడి పంటకు వచ్చే వ్యాధుల నివారణకు సస్య రక్షణ చర్యలు చేపట్టేందుకు పలు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ వైస్‌చైర్మన్‌ రమ్య, సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. కాగా ముఖ్యమైన స్థాయిసంఘ సమావేశాలకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులెవ్వరూ హాజరుకాలేదు.

Updated Date - Feb 02 , 2024 | 12:36 AM