Share News

33మంది ‘ఎండీయూ’ ఆపరేటర్లకు జీతాలు కట్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:09 AM

ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందించాల్సిన ఎండీయూ వాహన ఆపరేటర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణపై 33మందికి జీతాలు నిలుపుదల చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

33మంది ‘ఎండీయూ’ ఆపరేటర్లకు జీతాలు కట్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 11: ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందించాల్సిన ఎండీయూ వాహన ఆపరేటర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణపై 33మందికి జీతాలు నిలుపుదల చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 5.41లక్షల రేషన్‌కార్డుదారులకు చిత్తూరు డివిజన్‌లో 167 మంది, పలమనేరు డివిజన్‌లో 169 మంది ఎండీయూ వాహన ఆపరేటర్లు ప్రతినెలా 1-17 తేదీల మధ్య నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.18వేలను, సహాయకులకు రూ.3వేలను జీతంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా, డిసెంబరులో కార్డుదారులకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందించని కారణంగా 33మంది జీతాలను ఈనెల ప్రారంభంలో నిలిపివేస్తూ డీఎస్వో కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jan 12 , 2024 | 06:37 AM