Share News

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:26 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలను పాటించాలని జేసీ శ్రీనివాసులు అన్నారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలను పాటించాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నోడల్‌ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. నోడల్‌ అధికారులందరూ గురువారం నుంచి తమకు కేటాయించిన ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నం కావాలన్నారు. ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ గుర్తించిందని, అధికారుల వివరాలను అప్‌లోడ్‌ చేయడం జరిగిందన్నారు. ఈవీఎంలను సరైన రీతిలో భద్రపరచాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుల్లయ్య, ఆర్డీవోలు, ఈఆర్వోలు, ఇతర నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇళ్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయండి

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మ్యుటేషన్‌ ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిదిద్దాలని, ఆర్డీవో స్థాయిలో అనుమతి జరిగిందన్నారు. 1500 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అవసరమైతే ఆక్సిలరి పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. రీ సర్వే మూడో దశను త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో సర్వే ఏడీ మహబూబ్‌ భాషా, ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలు, గ్రామ సర్వేయర్లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:26 AM