Share News

కాణిపాక ఆలయానికి వేలాల ద్వారా రూ.84.45 లక్షల ఆదాయం

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:36 AM

కాణిపాక వినాయక స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన బహిరంగ వేలాలు, సీల్‌, ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా 84,45,400 ఆదాయం చేకూరినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.

కాణిపాక ఆలయానికి వేలాల ద్వారా రూ.84.45 లక్షల ఆదాయం

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 14: కాణిపాక వినాయక స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన బహిరంగ వేలాలు, సీల్‌, ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా 84,45,400 ఆదాయం చేకూరినట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయ కార్యాలయ భవనం వద్ద పలు టెండర్లు నిర్వహించారు. ఆలయం వద్ద సెల్‌ఫోన్లు, కెమెరాలు భద్రపరచుకునేందుకు రూ.47,00,400.. శివాలయం పరిసరాలు, పార్కువద్ద ఫొటోలు తీసే హక్కు కోసం రూ.18,05,000.. డార్మెటరీహాల్‌ వద్ద బంకు నిర్వహణకు రూ.4,10,000.. మూల విరాట్‌ పాలాభిషేకానికి పాల సరఫరాకు రూ.6,15,000.. బస్టాండు వద్ద బంకు నిర్వహణకు రూ. 9,15,000 చొప్పున హెచ్చుపాటదారులు హక్కులు పొందారు. వీరికి ఏడాది కాలపరిమితి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏఈవోలు హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ వాసు, ఏసీ కార్యాలయ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యం నాయుడు, టెండర్‌ దారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:36 AM