Share News

ఓటరు తుది జాబితాను పునఃపరిశీలించండి

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:47 AM

ఓటరు తుదిజాబితాను ఈనెల 22న ప్రచురితం చేయడానికి ముందు ఆ జాబితాను పునఃపరిశీలించి తప్పులుంటే సరిదిద్దాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ పోలా భాస్కర్‌ సూచించారు.

ఓటరు తుది జాబితాను పునఃపరిశీలించండి
ఎన్నికల అధికారులతో సమీక్షిస్తున్న రోల్‌ అబ్జర్వర్‌ పోలా భాస్కర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 17: ఓటరు తుదిజాబితాను ఈనెల 22న ప్రచురితం చేయడానికి ముందు ఆ జాబితాను పునఃపరిశీలించి తప్పులుంటే సరిదిద్దాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ పోలా భాస్కర్‌ సూచించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో ప్రత్యేక ఓటర్ల సవరణపై ఆయన ఎన్నికల అధికారులతో సమీక్షించారు. అందిన ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులకు సంబంధించి ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని, ఫారం -6, 7, 8కి సంబంధించిన రికార్డులన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరిశీలన అనంతరం నిర్ధారించుకున్న తర్వాత తుది ఓటరు జాబితా ముద్రణ చేపట్టాలని స్పష్టంచేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఓటరు జాబితాల విషయంలో అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్‌ షన్మోహన్‌ వివరించారు. ఈనెల 22న మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్‌, ఆర్డీవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌, లక్ష్మీప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:47 AM