rash driving చిచ్చురేపిన ర్యాష్ రైడింగ్
ABN , Publish Date - Sep 09 , 2024 | 01:24 AM
పక్క గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ గ్రామంలో ద్విచక్ర వాహనాలను ర్యాష్‌గా నడపడంపై స్థానిక మహిళలు ప్రశ్నించారు. దీనిపై మాటామాటా పెరిగి రెండు గ్రామాల మధ్య దాడులకు దారితీసి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కేవీబీపురం మండలం పెరిందేశం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై రాగిగుంటలో అతివేగంగా చక్కర్లు కొట్టారు. భయపడ్డ స్థానిక మహిళలు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.
ఓ ఆర్టీసీ బస్సు అద్దం ధ్వంసం
కేవీబీపురం, సెప్టెంబరు 8: పక్క గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ గ్రామంలో ద్విచక్ర వాహనాలను ర్యాష్‌గా నడపడంపై స్థానిక మహిళలు ప్రశ్నించారు. దీనిపై మాటామాటా పెరిగి రెండు గ్రామాల మధ్య దాడులకు దారితీసి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కేవీబీపురం మండలం పెరిందేశం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై రాగిగుంటలో అతివేగంగా చక్కర్లు కొట్టారు. భయపడ్డ స్థానిక మహిళలు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఆ యువకులు అక్కడినుంచి వెళ్లి తమ గ్రామం సుమారు 30మందిని వెంటబెట్టుకొచ్చారు. దీంతో ఈ గొడవ కాస్తా రెండు గ్రామాల మధ్య పరస్పర దాడులకు దారితీసింది. ఆదివారం ఉదయం మళ్లీ పెరిందేశంవాసులు మళ్లీ రాగిగుంటకు చేరుకున్నారు. దుకాణాలను ధ్వంసం చేసి, పెరిందేశం గ్రామస్తులపై దాడికి దిగారు. దీంతో రెండు గ్రామాలవారు కొట్లాటకు తెగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గొడవను అడ్డుకోబోయిన పిచ్చాటూరు ఎస్‌ఐ వెంకటే్‌షపైనా మద్యం సీసాలు విసరడంతో ఎడమ కన్ను వద్ద స్వల్ప గాయమైంది. మరోవైపు రాగిగుంటవాసులు పిచ్చాటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. ఏఎ్‌సఐ లోకనాథం అండతోనే పెరిందేశంవాసులు దాడి చేశారని ఆరోపించారు. ఈక్రమంలో గుర్తుతెలియని ఆందోళనకారులు అటుగా వచ్చిన శ్రీకాళహస్తి డిపోకి చెందిన బస్సు అద్దాన్నీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహరాచారి, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ పలువురు సీఐలు, ఎస్‌ఐలతో ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఈ గొడవతో సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరువర్గాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, రెండు గ్రామాల్లోనూ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
మామ అల్లుళ్లపై వేటుకు సన్నద్ధం
కేవీబీపురం పోలీ్‌సస్టేషన్‌లో ఏఎ్‌సఐ, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మామ అల్లుళ్లపై బదిలీ వేటుకు అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. నిబంధనల ప్రకారం రక్తసంబంధీకులు ఒకే పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసేందుకు వీలుండదు. అయితే ఏఎ్‌సఐ.. రాజకీయ అండతో తన కుమార్తె భర్త అయిన కానిస్టేబుల్‌ను తాను పనిచేస్తున్న పోలీ్‌సస్టేషన్‌కు డీవోగా తెచ్చుకున్నారు. ఈ ఏఎ్‌సఐ పనిచేసినా ప్రతిచోటా అనేక ఆరోపణలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. నెల కిందట కానిస్టేబుల్ అయిన అల్లుడు ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకుని చెల్లించకపోగా, తప్పుడు కేసు పెడతానంటూ బెదిరించడంపై బాధితుడు 100కు ఫోన్ చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కొంతనగదు వసూలు చేయించిన ఘటన కూడా ఆదివారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. మరోవైపు ఈ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐని కూడా నియమించకుండా తానే చక్రం తిప్పుతున్నట్లు ఫిర్యాదు అందాయి. తాజాగా ఇదే ఏఎ్‌సఐ అండతోనే తమపై దాడి జరిగినట్లు రాగిగుంటవాసులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మామాఅల్లుళ్లను తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.