Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు 23 వరకు పొడిగింపు

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:18 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకునేందుకు కల్పించిన అవకాశాన్ని 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు 23 వరకు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21: పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకునేందుకు కల్పించిన అవకాశాన్ని 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందికి జిల్లాలో ఓటుహక్కు ఉంటే వినియోగించుకునేందుకు ఫారం-12 పూరించి, ఈ నెల 23వ తేదీలోగా ఆయా శాఖల హెచ్‌వోడీలకు అందజేయాలని పేర్కొన్నారు. గతంలో 22వ తేదీ వరకు ఉన్న ఈ అవకాశాన్ని పలువురు ఉద్యోగుల విన్నపం మేరకు ఒకరోజు పొడిగించామని వివరించారు. ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లయితే అట్టివారు ఫారం-12, అనెగ్జర్‌ 12(ఇ)ని హెచ్‌ఓడీల ద్వారా కలెక్టర్‌కు సమర్పించాలని తెలిపారు. గడువులోగా ఫారాలు అందించకుంటే వారు సొంత నియోజకవర్గాలకు వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందని వివరించారు. అటువంటి వారికి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వెసులుబాటు ఉండదని తెలిపారు.

Updated Date - Apr 22 , 2024 | 02:18 AM