3న పోలియో చుక్కల కార్యక్రమం
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:34 AM
జిల్లాలో మార్చి 3వ తేదీన 0-5 ఏళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలను వేయించాలని, ఆ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
0-5 ఏళ్ల పిల్లలకు వేయించాలన్న కలెక్టర్
చిత్తూరు, ఫిబ్రవరి 29: జిల్లాలో మార్చి 3వ తేదీన 0-5 ఏళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలను వేయించాలని, ఆ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. గురువారం పోలియో చుక్కలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు 4, 5 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేయించాలన్నారు. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ కేంద్రాల పరిధిలో ఎనిమిది మంది ప్రోగ్రామ్ అధికారుల ద్వారా 142 రూట్లలో 1415 కేంద్రాల ద్వారా 209971 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందులో 149 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని, వీటిని మొబైల్ బూత్‌ల ద్వారా కవర్ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల అధికారి రవిరాజు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌రెడ్డి, డీపీఎంవో హర్షవర్ధన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.