Share News

పోలీసు సంక్షేమమూ ముఖ్యమే: ఎస్పీ

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:37 AM

పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడటమే కాకుండా.. వారి సంక్షేమాన్ని చూడటం కూడా తనకు ముఖ్యమేనని ఎస్పీ జాషువా అన్నారు.

పోలీసు సంక్షేమమూ ముఖ్యమే: ఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ జాషువా

చిత్తూరు, ఫిబ్రవరి 14: పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడటమే కాకుండా.. వారి సంక్షేమాన్ని చూడటం కూడా తనకు ముఖ్యమేనని ఎస్పీ జాషువా అన్నారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు అతిథి గృహంలో సాయుధ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఏఆర్‌ విభాగం క్రమశిక్షణకు మారుపేరని, ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగడానికి సాయుధ పోలీసుల సహకారం ఎంతో అవసరమన్నారు. అంతకుముందు ఏఆర్‌ పోలీసు అధికారులు, సిబ్బందిని పరిచయం చేసుకుని వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అరీఫుల్లా, ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ ఇలియాస్‌ బాషా, ఎస్‌బీ సీఐ గంగిరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:37 AM