కౌంటింగ్ బాధ్యతల కోసం ఇతర జిల్లాలకు పోలీసు అధికారులు
ABN , Publish Date - May 26 , 2024 | 01:58 AM
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించడం కోసం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పలువురు అధికారులను ఇతర జిల్లాలకు అటాచ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి (నేరవిభాగం), మే 25 : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించడం కోసం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పలువురు అధికారులను ఇతర జిల్లాలకు అటాచ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలోని సీఐడీ డీఎస్పీ శంకర్‌ను శ్రీసత్యసాయి జిల్లాకు,లక్ష్మీనారాయణను చిత్తూరుకు, సెబ్ ఏఎస్పీ రాజేంద్రను తిరుపతికి, సీఐడీ డీఎస్పీ శిరీషను ప్రకాశం జిల్లాకు, విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంటు ఎస్పీ ఈశ్వర రెడ్డిని కృష్ణా జిల్లాకు అటాచ్ చేశారు.వీరంతా ఆయా జిల్లాల ఎస్పీల వద్ద రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.