Share News

ఇక దయచేయండి

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:47 AM

‘మీ సేవలు చాలు.. ఇక దయ చేయండి’ అంటూ వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం నియమించిన సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించాలంటూ నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఇక దయచేయండి

నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్లకు ఉద్వాసన ఆదేశాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 7: ‘మీ సేవలు చాలు.. ఇక దయ చేయండి’ అంటూ వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం నియమించిన సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించాలంటూ నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. ఆ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్‌ పోస్టుల్లో నియమితులైన వారి చేత రాజీనామా చేయించాలని ఆయా శాఖలను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాకు సంబంధించి ఒక సలహాదారుడు, 15 కార్పొరేషన్ల చైర్మన్లకు నేడో రేపో ఉద్వాసన ఆదేశాలు జారీ కానున్నాయి. అయితే, వీరిలో కొందరు ఇప్పటికే రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ రాజీనామా పత్రాలను ఆయా అధికారులకు పంపారు. మొత్తమ్మీద జిల్లాలో ప్రభుత్వ సలహాదారుడు (ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు), చిత్తూరు మాజీ ఎంపీ ఎం.జ్ఞానేంద్రరెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సురేష్‌, ఈడిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శాంతి, వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ వనిత, పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.బీ. కుమార్‌రాజా, ఏపీఎంబీసీ చైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లాం, ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా, ఫోక్‌ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్‌ కె. నాగభూషణం, ఏపీఎ్‌సఆర్టీసీ రీజనల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌ ఎం.రెడ్డెమ్మ, సీడీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌. నాగలక్ష్మి, చుడా చైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, ఐసీడీసీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌ శైలజారెడ్డి, పి.కె.ఎం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి యాదవ్‌, చిత్తూరు జిల్లా కోఆపరేటివ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ చైర్మన్‌ జి. మురళీమోహన్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మధుబాబు, జిల్లా పరిషత్‌ స్త్రీ శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భారతి మధుకుమార్‌ ఉన్నారు. అలాగే, 76 సింగిల్‌ విండోల త్రిసభ్య కమిటీలూ ఇంకా వైదొలగలేదు. ఇంకా రాజీనామా చేయని వారికి ఉద్వాసన పలకనున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 08:11 AM