Share News

ప్రయోగ వేదికపైకి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:52 AM

ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి అనుసంధాన పనులు పూర్తయ్యాయి.

ప్రయోగ వేదికపైకి  జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌
రాకెట్‌ మొదటి దశ, . రాకెట్‌ రెండో దశ, ప్రయోగ వేదికపై రాకెట్‌

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 12: ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి అనుసంధాన పనులు పూర్తయ్యాయి. 2,275 కిలోల బరువు గల కలిగిన ఇన్‌శాట్‌-3డీఎ్‌స ఉపగ్రహాన్ని ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటలకు ప్రయోగించేందుకు షార్‌ శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. జీఎ్‌సఎల్వీ- మార్క్‌2 సిరీ్‌సలో ఇది 16వ ప్రయోగం. పీఎ్‌సఎల్వీ రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జీఎ్‌సఎల్వీని మూడు దశల్లోనే ప్రయోగిస్తారు. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో (వ్యాబ్‌) రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులతో పాటు రాకెట్‌ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేసి రెండో ప్రయోగ వేదికకు రాకెట్‌ను తరలించారు. ప్రయోగ వేదిక ఉన్న జీఎ్‌సఎల్వీ రాకెట్‌కు లెవల్‌-1, లెవల్‌-2 తనిఖీలను చేపడుతున్నారు. తుది పరీక్షల అనంతరం లాంచ్‌ రిహార్సల్‌, ప్రీ కౌంట్‌డౌన్‌ నిర్వహించారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటలకు జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది.

Updated Date - Feb 13 , 2024 | 12:52 AM