Share News

బిల్లులు చెల్లిస్తేనే సచివాలయంలోకి...!

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:20 AM

తనకు బిల్లులు చెల్లించే వరకు సచివాలయంలోకి వెళ్లడానికి వీల్లేదంటూ కేవీబీపురం మండలం ఓళ్లూరు సర్పంచ్‌ సురేష్‌ సిబ్బందిని అడ్డుకున్నారు

బిల్లులు చెల్లిస్తేనే సచివాలయంలోకి...!

తనకు బిల్లులు చెల్లించే వరకు సచివాలయంలోకి వెళ్లడానికి వీల్లేదంటూ కేవీబీపురం మండలం ఓళ్లూరు సర్పంచ్‌ సురేష్‌ సిబ్బందిని అడ్డుకున్నారు. గ్రామస్తులు, వార్డు మెంబర్లతో కలిసి మంగళవారం ఉదయం సచివాలయానికి వచ్చిన సిబ్బందిని లోనికి వెళ్లనీయకుండా డోరు వద్ద అడ్డంగా బైఠాయించారు. ఈ విషయం తెలుసకున్న పోలీసులు, ఎంపీడీవో శివప్రసాద్‌, ఈవోపీఆర్డీ దయాసాగర్‌ సచివాలయం వద్దకు వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు. గతంలో చేసిన రెండు మోటారు పనులకు రూ.5లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, అలాగే ప్రస్తుతం మరమ్మతులకు గురైన బోర్లను బాగుచేయించేందుకు సైతం బిల్లులు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ కోరారు.తాగునీరు లేక గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు.తాను టీడీపీ సర్పంచ్‌ కావడంతోనే ఎంబుక్‌ బిల్లు పెట్టడం లేదని సర్పంచ్‌ ఆరోపించారు. రెండు రోజుల్లో బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.

Updated Date - Mar 06 , 2024 | 01:20 AM