Share News

సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:14 AM

సంక్రాంతి పండుగ నుంచి ఖాతాదారుల సౌకర్యార్థం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సౌకర్యాలతో కూడిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్‌ ఏఎ్‌సఎన్‌ ప్రసాద్‌ తెలిపారు.

సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు

సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్‌ ఏఎ్‌సఎన్‌ ప్రసాద్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 13: సంక్రాంతి పండుగ నుంచి ఖాతాదారుల సౌకర్యార్థం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సౌకర్యాలతో కూడిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్‌ ఏఎ్‌సఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. శనివారం చిత్తూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డిపాజిట్లపై ఇతర బ్యాంకులకంటే 3.5శాతం అత్యధిక వడ్డీ ఇస్తున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థికసంవత్సరంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు వ్యాపార లావాదేవీలు రూ.2243 కోట్ల దాకా పెరిగినట్లు చెప్పారు.ఆరు జిల్లాల్లో 240 శాఖలతో నడుస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖలను త్వరలో మరో 10చోట్ల ప్రారంభిస్తామని తెలిపారు. డిపాజిట్లపై 1-2 సంవత్సరాల వరకు సాధారణ ఖాతాదారులకు 7.50శాతం, 60ఏళ్ళు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు 8శాతం వడ్డీ, 2-3 సంవత్సరాల వరకు 7.75 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 8.25 శాతం అందిస్తామన్నారు. దీనబంధు పథకం కింద బంగారు నగల రుణాలు, ఎస్సీ, బీసీ ఖాతాదారులకు తక్కువ వడ్డీతో బంగారుపై రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న తరహా బ్యాంకుల్లో అతి తక్కువ నిరర్థక ఆస్తులు కల్గిన బ్యాంకుగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు గుర్తింపు పొందిందన్నారు. తమ బ్యాంకులో ట్యాక్స్‌ సేవర్‌ డిపాజిట్‌ అందుబాటులో ఉందని, దీని ద్వారా ఖాతాదారులు 80-సి రాయితీ పొందవచ్చన్నారు. తమ బ్యాంకులో నిల్వచేసిన బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు డీఐసీజీసీ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:14 AM