Share News

టీడీపీలోకి వంద కుటుంబాలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:15 AM

రామకుప్పం మండలం బల్ల, బందార్లపల్లె, కొంగనపల్లె, 89పెద్దూరు, గొరివిమాకులపల్లె పంచాయతీల పరిధిలోని వైసీపీకి చెందిన వంద కుటుంబాలవారు టీడీపీలో చేరారు.

టీడీపీలోకి వంద కుటుంబాలు
పెరియప్ప, చంద్రను పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు

ఫ కేంద్ర కార్యాలయంలో చేరిక

ఫ సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు

రామకుప్పం, జనవరి 4: రామకుప్పం మండలం బల్ల, బందార్లపల్లె, కొంగనపల్లె, 89పెద్దూరు, గొరివిమాకులపల్లె పంచాయతీల పరిధిలోని వైసీపీకి చెందిన వంద కుటుంబాలవారు టీడీపీలో చేరారు. వీరంతా మంగళగిరిలో గురువారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బల్లకు చెందిన వైసీపీ రెబల్‌ సర్పంచు అభ్యర్థి చంద్ర, సీనియర్‌ నేతలు పెరియప్ప, మేస్త్రీవెంకటేశ్‌, వెంకటాచలం, బందార్లపల్లె పంచాయతీకి చెందిన మంజునాథరెడ్డి, సుకుమార్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం, గొరివిమాకులపల్లెకు చెందిన నూరుల్లా, రియాజ్‌, అష్ర్‌ఫఅలీ, కొంగనపల్లె పంచాయతీ కొళ్లుపల్లెకు చెందిన గోవిందప్ప, 89పెద్దూరు పంచాయతీకి చెందిన శ్రీనివాసులు, మురుగే్‌షతో పాటు మిగిలిన వారికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. గ్రామాలాభివృద్ధిలో వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రచారాంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. కుప్పం నియోజకవర్గంలో భారీ మెజారిటీ అందించేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. టీడీపీ ప్రకటించిన సూపర్‌సిక్స్‌ కార్యక్రమాలను గడప-గడపకు వెళ్ళి ఓటర్లకు వివరించాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు.. వైసీపీలోనూ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిపైనా అధికార పార్టీ నేతలే దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వైసీపీ అరాచక విధానాలు నచ్చకే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారన్నారు. రానున్న కాలంలో వైసీపీకి మనుగడే లేదన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రజల్లో భయాన్ని పోగొట్టి, అభివృద్ధి, సంక్షేమం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారిశ్రీనివాసులు, ఎస్సీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, బీసీసెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షుడు చలపతి, పార్టీ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆనందరెడ్డి, నరసింహులు, మాజీ ఎంపీపీ ఆంజినేయరెడ్డి, తెలుగుయువత మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు విశ్వనాథ్‌, వెంకటాచలం, నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:15 AM