రోడ్డుప్రమాదంలో అత్తాకోడళ్ల మృతి
ABN , Publish Date - Jan 26 , 2024 | 02:04 AM
రోడ్డు ప్రమాదం లో అత్తాకోడళ్లు మృతి చెందడం బాధిత కుటుంబంతో పాటు పిచ్చాటూరువాసులను విషాదానికిలో నుచేసింది. పిచ్చాటూరుకు చెందిన బుక్‌స్టోర్ యజమాని ఉమాశంకర్ గుప్త అలియాస్ శంకర్‌శెట్టి భార్య ఎ.లీలారాణి,చిన్న కుమారుడు వినోద్, కోడలు విజయ అను,మనవళ్ళతో కలసి గురువారం ఉదయం కంచి మీనాక్షి గుడికి వెళ్లారు.
పిచ్చాటూరు, జనవరి 25 : రోడ్డు ప్రమాదం లో అత్తాకోడళ్లు మృతి చెందడం బాధిత కుటుంబంతో పాటు పిచ్చాటూరువాసులను విషాదానికిలో నుచేసింది. పిచ్చాటూరుకు చెందిన బుక్‌స్టోర్ యజమాని ఉమాశంకర్ గుప్త అలియాస్ శంకర్‌శెట్టి భార్య ఎ.లీలారాణి,చిన్న కుమారుడు వినోద్, కోడలు విజయ అను,మనవళ్ళతో కలసి గురువారం ఉదయం కంచి మీనాక్షి గుడికి వెళ్లారు.దర్శనానంతరం అక్కడినుంచి బెంగళూరుకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలోని రాయవేలూరుకు 10 కి.మీ ముందు కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో లీలారాణి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మిగిలిన వారిని చికిత్స నిమిత్తం వేలూరు నరువ్య ఆస్పత్రికి తరలించారు. విజయఅను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.శంకర్‌శెట్టి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా వినోద్‌కు చేయి విరిగినట్లు సమాచారం. పిల్లలు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పిచ్చాటూరులో సుమారు 40 ఏళ్లుగా బుక్‌స్టోర్ నడుపుతూ స్థానికంగా అందరికీ చిరపరిచితుడైన శంకర్‌శెట్టి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల స్థానిక వ్యాపార సంఘం దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది.