Share News

మెగా డీఎస్సీ విడుదల చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:51 AM

రాష్ట్రంలో వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్‌ రాఘవేంద్ర డిమాండ్‌ చేశారు.

మెగా డీఎస్సీ విడుదల చేయాలి
బొత్స దిష్టిబొమ్మతో ఏబీవీపీ నాయకులు, అభ్యర్థులు

తిరుపతి(విద్య), జనవరి 6: రాష్ట్రంలో వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్‌ రాఘవేంద్ర డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో బీఈడీ, డీఈడీ, బీపీఈడీ అభ్యర్థులతో కలసి శనివారం తిరుపతిలోని బాలాజీకాలనీ సర్కిల్‌లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బొత్స ఇంక లేరు అన్న బ్యానర్‌నూ ప్రదర్శించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనానికి పూనుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు ఎంతో ఆశగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ని విడుదల చేస్తామని మాటిచ్చిన సీఎం జగన్‌ ఇప్పటివరకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయకపోవడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయకులు పవన్‌కుమార్‌, అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:51 AM