Share News

సమగ్రశిక్ష ఉద్యోగులకు పలువురి సంఘీభావం

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:22 AM

రెగ్యులరైజేషన్‌ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్‌ ముందు చేపట్టిన సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరింది.

సమగ్రశిక్ష ఉద్యోగులకు పలువురి సంఘీభావం
ఆర్థిక సాయం అందిస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 31: రెగ్యులరైజేషన్‌ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్‌ ముందు చేపట్టిన సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరింది. ఈ క్రమంలో ఉద్యోగులకు పలువురు సంఘీభావం ప్రకటించి అర్థిక సాయం అందించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్‌తో పాటు బంగారుపాళ్యం ఎంఈవో నాగేశ్వరరావు, రమే్‌షబాబు, ఉపాధ్యాయులు లక్ష్మీపతి, ధనంజయులు, మదన్‌మోహన్‌, జగదీష్‌ తదితరులు ఆర్థిక సాయం అందించారు. తామంతా ఒకే కుటుంబం అని, మీ సమస్యలు మా సమస్యలేనని టీచర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగులు విల్వనాథం, దేవరాజులు, ఢిల్లీ కుమార్‌, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:22 AM