Share News

కర్ణాటక మద్యం సీజ్‌: ఇద్దరి అరెస్ట్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:38 AM

ర్ణాటక మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరి కారుతో పాటు 2400 టెట్రా మద్యం ప్యాకెట్లను సీజ్‌ చేశారు.

కర్ణాటక మద్యం సీజ్‌: ఇద్దరి అరెస్ట్‌
నిందితులను మీడియాకు చూపిస్తున్న డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి

చిత్తూరు, ఫిబ్రవరి 14: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరి కారుతో పాటు 2400 టెట్రా మద్యం ప్యాకెట్లను సీజ్‌ చేశారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరులోని తాలూకా పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఈస్ట్‌ సీఐ కుళ్లాయప్ప, తాలూకా ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చిత్తూరు మండలం కన్నికాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో తనిఖీలు చేపట్టామన్నారు. పోలీసులు ఓ కారును ఆపి తనిఖీ చేయగా, వివిధ రకాల బ్రాండ్లకు చెందిన 2400 టెట్రా ప్యాకెట్ల మద్యం దొరికిందన్నారు. దీంతో కారులో ఉన్న జీడీ నెల్లూరు మండలం కాళేపల్లెకు చెందిన తోటి ముద్దుకృష్ణ, ఒగ్గువారిపల్లెకు చెందిన జానకిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మద్యంతో పాటు కారును సీజ్‌ చేశామని, వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 12:38 AM