కర్ణాటక మద్యం స్వాధీనం: ఒకరి అరెస్టు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:49 AM
అక్రమంగా తరలిస్తున్న రూ.80వేల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు.

పెనుమూరు, మార్చి 5: అక్రమంగా తరలిస్తున్న రూ.80వేల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. సెబ్ సీఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె సమీపంలోని పొలంలో 26 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పూడ్చిపెట్టారని పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం పోలీసులు దాడి చేసి పూడ్చిపెట్టిన 2496 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, శివకోటిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పవన్‌కుమార్, సిబ్బంది జయశంకర్, సురేంద్ర పాల్గొన్నారు.