నేడు జేవీడీ నిధుల విడుదల
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:30 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన మొదటి విడత నిధులను శుక్రవారం తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు.
చిత్తూరు, ఫిబ్రవరి 29: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన మొదటి విడత నిధులను శుక్రవారం తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేస్తారని జిల్లా బీసీ సంక్షేమం సంఘం, సాధికారిత అధికారి రబ్బానీ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. 32427 మంది విద్యార్థులకు రూ.20.54 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు.