జడ్పీ మాజీ సీఈవోపై విచారణాధికారిగా జేసీ
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:55 AM
జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి అధికారిని నియమిస్తారని అనుకున్నారు. అయితే కలెక్టర్ షన్మోహన్ విచారణ అధికారిగా చిత్తూరు జేసీ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

చిత్తూరు రూరల్, ఏప్రిల్ 2: జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి అధికారిని నియమిస్తారని అనుకున్నారు. అయితే కలెక్టర్ షన్మోహన్ విచారణ అధికారిగా చిత్తూరు జేసీ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. నేడో, రేపో ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇతడిపైౖ లోకాయుక్తలో వచ్చిన ఫిర్యాదులు, విచారణపై నివేదికలను కూడా జేసీ శ్రీనివాసులు పంపించారు. ఇదిలా ఉండగా జిల్లాలో, జడ్పీ పరిధిలో సుదీర్ఘకాలం పనిచేయడం, అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉందని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఇతర టీడీపీ నాయకులు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.