Share News

కొమరగుంటలో జల్లికట్టు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:57 AM

వెదురుకుప్పం మండలం కొమరగుంటలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లిని ఏర్పాటు చేసి, వివిధ రకాల పట్టీలను కోడెగిత్తల కొమ్ములకు కట్టి అల్లి వైపు వదిలారు.

కొమరగుంటలో జల్లికట్టు
గిత్త కాళ్ల కింద పడిన యువకుడు

వెదురుకుప్పం, మార్చి 10: వెదురుకుప్పం మండలం కొమరగుంటలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. అల్లిని ఏర్పాటు చేసి, వివిధ రకాల పట్టీలను కోడెగిత్తల కొమ్ములకు కట్టి అల్లి వైపు వదిలారు. అప్పటికే అల్లిలో ఉన్న యువకులు కోడెగిత్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. నిలువరించి పట్టీలను దక్కించుకునే క్రమంలో యువకులు కొందరు గాయపడ్డారు. జల్లికట్టు నిర్వహణతో ఆ గ్రామంలో జన సందడి ఏర్పడింది.

Updated Date - Mar 11 , 2024 | 12:57 AM