Share News

బెల్టు షాపులు నిర్వహించరాదంటూ ప్రమాణం

ABN , Publish Date - May 26 , 2024 | 12:26 AM

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లెలో బెల్టు షాపులు నిర్వహించకూడదని, మద్యం అమ్మకాలు చేయకూడదని గ్రామస్తులు ప్రమాణం చేశారు.

బెల్టు షాపులు నిర్వహించరాదంటూ ప్రమాణం
ఆలయం వద్ద ప్రమాణం చేస్తున్న గ్రామ పెద్దలు

సోమల, మే 25: సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లెలో బెల్టు షాపులు నిర్వహించకూడదని, మద్యం అమ్మకాలు చేయకూడదని గ్రామస్తులు ప్రమాణం చేశారు. శనివారం భారతంమిట్టలోని పంచపాండవ ఆలయం వద్ద బెల్టు షాపులు నిర్వహిస్తున్న, మద్యం విక్రయిస్తున్న వారితో సమావేశమయ్యారు. గ్రామంలో బెల్టు షాపులు నిర్వహించరాదని, మద్యం అమ్మకాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనికి కట్టుబడి ఉండాలని అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు.

Updated Date - May 26 , 2024 | 12:26 AM