Share News

కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:36 AM

జిల్లాలోని ఎనిమిది కేజీబీవీ పాఠశాలల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 11: జిల్లాలోని ఎనిమిది కేజీబీవీ పాఠశాలల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్‌లో చేరేందుకు మంగళవారం నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతిలో 320, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 320, 7వ తరగతిలో మూడు, 8వ తరగతిలో నాలుగు, 9వ తరగతిలో ఆరు చొప్పున 653 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు 513 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్‌ 2బి, జువాలజీ, హిస్టరీ పేపర్‌ 2 పరీక్షలకు 513 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. 10609 మంది విద్యార్థులకు గాను 10,093 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 01:36 AM