Share News

ఆదాయపన్ను శాఖకు రూ. 9.64 కోట్ల బంగారం, వెండి అప్పగింత

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:59 AM

సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా మంగళవారం పెద్దఎత్తున తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను ఆదాయపన్నుశాఖకు అప్పగించినట్లు సీఐ వేణుగోపాల రెడ్డి చెప్పారు.

 ఆదాయపన్ను శాఖకు రూ. 9.64 కోట్ల బంగారం, వెండి అప్పగింత
వాహనంలో తనిఖీలు చేస్తున్న సీఐ వేణుగోపాల్‌రెడ్డి

చిల్లకూరు, ఏప్రిల్‌ 23 : సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా మంగళవారం పెద్దఎత్తున తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను ఆదాయపన్నుశాఖకు అప్పగించినట్లు సీఐ వేణుగోపాల రెడ్డి చెప్పారు. చిల్లకూరు మండలంలోని బూదనం టోల్‌ప్లాజా వద్ద వున్న చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా జీఆర్‌టీ, జోయలూకాస్‌, రాధాకృష్ణా, సదం జ్యూవెలరీ దుకాణాలకు చెందిన బంగారం, వెండి ఆభరణాలను నెల్లూరు నుంచి మదనపల్లె, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు సరైన ధృవీకరణపత్రాలు లేకుండా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ వాహనంలో రూ. 9,41,76,050 విలువచేసే 13 కేజీల బంగారం, రూ. 22,28,304 విలువ చేసే 21 కేజీల వెండి అభరణాలు లభించాయన్నారు. సీజ్‌చేసి ఆదాయపన్నుశాఖకు అప్పగించడం జరిగిందన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 01:59 AM