Share News

బోడికొండలో ఆగని ఆక్రమణలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:34 AM

చిత్తూరు నగర శివార్లలోని బోడికొండలో అధికార పార్టీ నేతల ఆక్రమణలు ఆగడం లేదు.

బోడికొండలో ఆగని ఆక్రమణలు
బోడికొండలో చదును చేస్తున్న ఆక్రమణదారులు

ఎన్నికల పనుల్లో రెవెన్యూ అధికారులు

పనికానిచ్చేస్తున్న అధికార పార్టీ నేతలు

చిత్తూరు, ఫిబ్రవరి 11: చిత్తూరు నగర శివార్లలోని బోడికొండలో అధికార పార్టీ నేతల ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా స్థానిక రామ్‌నగర్‌కాలనీకి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్‌ ఒకరు తేనెబండ రెవెన్యూ పరిధిలోని 282-1 సర్వేనెంబరులో వారం రోజులుగా ఐదారు ప్లాట్లను చదును చేస్తున్నారు. ఒక్కో ప్లాటు రూ.3-రూ.4 లక్షల వరకు అమ్ముకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఎన్నికల పనుల్లో రెవెన్యూ అధికారులు ఉండటంతో తన పని కానిచ్చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సచివాలయ ఉద్యోగులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:34 AM