మన డాక్యుమెంట్ల భద్రత ఎంత?
ABN , Publish Date - Aug 01 , 2024 | 02:27 AM
జిల్లాలోని రిజిస్ర్టేషన్ శాఖలో కీలక డాక్యుమెంట్ల భద్రతపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర విలువైన పత్రాల భద్రతపై దృష్టి పెట్టింది.
వందేళ్లకు మించిన భవనాల్లో రికార్డులు
నేడు అధికారులతో కలెక్టర్ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్, జూలై 31: జిల్లాలోని రిజిస్ర్టేషన్ శాఖలో కీలక డాక్యుమెంట్ల భద్రతపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర విలువైన పత్రాల భద్రతపై దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లా రిజిస్ర్టేషన్ శాఖ పరిధిలో ఉన్న 8 సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో చిత్తూరు రూరల్, బంగారుపాళ్యం, కార్వేటినగరం, నగరి అద్దె భవనాల్లో చాలీచాలనీ గదుల్లో విలువైన రికార్డులు భద్రపరిచేందుకు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు రెవెన్యూ రిజిస్ర్టేషన్ కార్యాలయ రికార్డు గది 1860 నుంచి కొనసాగుతోంది. కుప్పంలో అప్పట్లో చంద్రబాబు చొరవతో సొంత భవనాన్ని ఏర్పాటుచేశారు. పలమనేరు, పుంగనూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు 1860-80 మధ్య నుంచి కొనసాగుతున్నాయి. పూర్తిగా భద్రత లేకుండా పోయింది. మరమ్మతులకు గత ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదు. కొత్త భవన నిర్మాణాలకు నిధులు, స్థలం కేటాయించలేదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ర్టేషన్ శాఖ నుంచి ఆదాయం పిండుకోవడం మీద చూపిన శ్రద్ధ.. వాటి బాగోగుల మీద పెట్టలేదు. అధికారులు ఎన్నోసార్లు అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రి పెద్దిరెడ్డి తదితరులకు సొంత భవనాలకు స్థలాలు కేటాయించాలంటూ విన్నవించినా పట్టించుకోలేదు.
నేడు సమావేశం..
రిజిస్ర్టేషన్ శాఖ ముఖ్య డాక్యుమెంట్ల భద్రతపై దృష్టి పెట్టిన జిల్లా యంత్రాంగం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టర్ సుమిత్‌కుమార్ అధ్యక్షతన సమావేశం కానుంది. కన్వీనర్‌గా జిల్లా రిజిస్ర్టార్ కే శ్రీనివా్‌సరావు, సభ్యులుగా ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, అగ్నిమాపకదళ జిల్లా అధికారులు ఉంటారు. సొంత, అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో ఉన్న విలువైన రికార్డుల భద్రతపై చర్చించనున్నారు. భవనాల తాజా పరిస్థితి, విద్యుత్ సరఫరా, కూలే స్థితిలో ఉన్నవాటి స్థానంలో సొంత భవనాల నిర్మాణాలు, స్థలం.. నిధుల కేటాయింపు గురించి ప్రభుత్వంతో చర్చించాల్సిన తీర్మానాలపై నిర్ణయం తీసుకోనున్నారు.